Sunday, February 26, 2012

వీర సావర్కార్


         

   వీర సావర్కార్ 
 (28-05-1883...26-02-1966)

            1910 సం జులై 10 వ తేది, సూర్యోదయం అవుతున్న సమయం. ఫ్రాన్స్ లో మార్సేల్స్ రేవుపట్నం లో మొరియో అనే ఓడ లంగరు వేసుకొని నిలబడి ఉంది. దానిలో ఏదో యాంత్రిక లోపం ఏర్పడింది. ఓడ సిబ్భంది ఆ లోపాన్ని సరిదిద్దే హడావిడిలో ఉన్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంది, ప్రయాణికులు ప్రశాంతంగా ఉన్నారు, అయితే ఈ వాతావరణం లో ఇమడకుండా ఒక యువకుడు ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు. నిశ్చింతగా ఉండటం అతనికి సాధ్యం కాదు ఎందుకంటే అతడు బందీగా ఉన్నాడు అది కూడా ఆంగ్ల ప్రభుత్వానికి... అతడి పైన రాజద్రోహం నేరం మోపబడి ఉంది. అతని కదలికలను అనుక్షణం కనిపెడుతూ ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు కూడా. 'నేను బయటకు వెళ్ళాలి' అన్నాడు బందీ, ఒక పొలిసు అతనిని మరుగుదొడ్డి దగ్గరకు తీసుకు వెళ్ళాడు. బందీ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు, బయట ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు, మరుగుదొడ్డి గుమ్మానికి పైన అద్దాల కిటికీ ద్వారా లోపల ఉన్న బందీ కదలికలు పసిగట్టచ్చు. లోపలకు వెళ్ళిన బందీ తన కోటు విప్పి అద్దానికి అడ్డంగా తగిలిచ్చాడు. మరుక్షణం ఉహించలేని విధంగా మరుగుదొడ్డి రంధ్రం నుండి సముద్రం లో కి జారిపోయాడు. కెరటాలతో పోరాటం చేస్తూ ఒడ్డుకు ఈదుకుంటూ పారి పోయాడు. "పారి పోతున్న బందీ పేరు సావర్కర్".

        1883 వ సం మే 28 న మాహారాష్ట్ర లోని నాసిక్ లో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు వినాయక దామోదర్ సావర్కర్ జన్మించాడు. అప్పటికే వారికి గణేష్ దామోదర్ సావర్కర్ అని అబ్బాయి ఉన్నాడు. సమాన అర్ధం వచ్చే పేర్లు గల ఈ అన్నదమ్ములిద్దరూ దేశ కార్యాలలో కూడా సమానంగా పాల్గొని తమకు సమాన పేర్లు పెట్టడానికి సార్ధకత కల్పించారు. 

           "మిత్ర మేళ" అనే సంస్థ ను స్థాపించి దానిద్వారా వ్యాయామశాల, గణేష్ పూజ, శివాజీ జయంతి లాంటి సార్వజనిక ఉత్సవాలు నిర్వహిస్తూ అందరిని చైతన్యవంతుల్ని చేస్తూ చిన్నతనంనుంచే స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని తలచిన సావర్కర్ "అభినవ భారత్" అనే సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాడు. లండన్ లో న్యాయ శాస్త్రం చదివిన సావర్కర్ అక్కడ చదువుతున్న సమయంలో కూడా "ఇండియా హౌస్" అనే సంస్థ ద్వారా స్వాతంత్ర్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లండన్ నుంచే 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి పుస్తకం వ్రాసిన సావర్కర్ ఆ పుస్తకాన్ని ఇండియా లోని తన అన్నకి పంపించాడు. అయితే ఆ విషయం తెలిసిన ఆంగ్ల ప్రభుత్వం గణేష్ సావర్కర్ ను బంధించి జీవిత ఖైదు విధించింది. మదన్లాల్ ధింగ్ర లాంటి సావర్కర్ స్నేహితులు పోరాటం లో మరణించారు. అయితే ఇక లండన్ లో ఉండటం ఇష్టం లేక తిరిగి భారత్ వచ్చే ప్రయత్నం లో సావర్కర్ ఆంగ్లేయులకు దొరికిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ కి మునుపెన్నడూ లేని రీతిలో 2 రెట్లు జీవిత ఖైదు శిక్ష గ విధించింది. ఒక జీవిత ఖైదు అంటేనే 25 సం ల కటిన కారాగారం, అలాంటిది 50 సం లు శిక్ష విధించినది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే 1922 లో సావర్కర్ ని విడుదల చేసి గృహనిర్భందం చేసింది. 13 సం లు గృహనిర్భందం లో మ్రగ్గిన సావర్కర్ ఆ తర్వాత కూడా ఎన్నో శిక్షలకు గురయ్యాడు . 1948 లో గాంధీ హత్య కేసు లో విచారణకు గురి అయిన సావర్కర్ నిరపరధిగా నిరుపించాబడ్డాడు. 

         1964 సం లో భారత ప్రభుత్వం సావర్కర్ కు "అప్రతిహతీ స్వతంత్ర్యవీర" అనే బిరుదును ప్రదానం చేసింది. భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సావర్కార్ 1966 సం ఫిబ్రవరి 26 న మృతిచెందారు.

           అంతవరకూ కేవలం సిపాయీల తిరుగుబాటుగా పిలువబడిన 1857 లో జరిగిన సైనికుల పోరాటాన్ని ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని పిలిచింది సావర్కరే!! '1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామము' అనే తన గ్రంధం లో (1907)ఈ చరిత్ర ను వ్రాశారు. ఇటలీ దేశానికి చెందిన మహా దేశ భక్తుడు మాజినీ జీవిత చరిత్రను 1906 లో వ్రాశారు! బాల్యంనుండే అనేక కవితలు గేయాలు దేశ భక్తిని పెంపొందించడానికి వ్రాశారు! అండమాన్ జైలులో హిందూ ముస్లిం ఖైదీలను ఏకం చేశారు. అంటరాని తనాన్ని నిర్మూలించడానికి సహపంక్తి భోజనాలను ప్రారంభించారు. అండమాన్ జైలు గోడల ను కాగితాలుగా చేసుకొని ఎన్నో గేయాలను, పద్యాలను, 'కమల గోమంతక్', 'మహా సాగర్' అనే కావ్యాలను రచించారు. అంటరానితనాన్ని నిరసించి నిమ్న వర్గాల వారిని దేవాలయలలోకి రానివ్వని దురాచారాన్ని ఖండించి , పూణే సమీపంలో 'రత్నగిరి' లో విఠలుని మందిరం నిర్మించి, దానికి పతిత పావన మందిరం అని పేరు బెట్టి, శంకరాచార్యులచే ఆ దేవాలయాన్ని ప్రారంభింప జేశారు. అండమాన్ జైలులో వారిని ఉంచిన గదిని జాతీయ స్మారక చిహ్నంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'కాలా పానీ' అనే హిందీ/తమిళ సినిమాలో ఈ అండమాన్ జైలు గురించే చూపించారు! చివరి రోజులలో కూడా 'భారత దేశ చరిత్రలో ఆరు స్వర్ణ పుటలు' అనే గ్రంధాన్ని రచించారు. కుల, మత, వర్ణ విచక్షణ లేని అఖండ భారతాన్ని గురించి కలలు కన్నారు. భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించి, ఎంతో విచారించారు విభజనకు! ఏ దేవుడినీ, దేవతలనూ ఆరాధించ వలసిన అవసరం వున్నా, లేకున్నా, దేశమాతనే దేవతగా ఆరాధించాలని ప్రబోధించారు! గాయత్రీ మంత్రం బదులుగా..నిత్యమూ స్వతంత్ర భారతీ భగవతి ని ఆరాధించే వారు! '' జయోస్తు తే శ్రీ మహన్మంగళే శివాస్పదే శుభదే..స్వతంత్ర తే భగవతి! త్వామహం యశో యుతాం వందే!'' అనేదే ఆ గాయత్రీ మంత్రం! ఎనభై ఆరు సంవత్సరాల పూర్ణ జీవితం అనుభవించి, అపర భీష్మాచార్యుల వారి వలె..ఆహార పానీయాలను తగ్గించి..ఆహారం పూర్తిగా చివరిలో మానేసి..స్వచ్చంద మరణాన్ని పొందారు!

Thursday, February 23, 2012

వీరేశలింగం పంతులు


వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. 
వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.చదువుకునే రోజుల్లో కేశవచంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు. 1867 లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష రాసి న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.
ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణా భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.
                 వీరేశలింగం హేతువాది .ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లల్ను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.
బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలన కు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధని లో వ్యాసాలు రాసాడు.ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడి కి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ (పెళ్ళయ్యాక బాపమ్మ కు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.
              సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.ఆయన 130కి పైగా గ్రంధాలు రాసాడు. ఆన్ని గ్రంధాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించాడు.

Wednesday, February 22, 2012

సుభాష్ చంద్రబోస్

 ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించిన సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో వోటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో తన ప్రాణాలను బలిదానం చేసిన మహానుభావుడు.
ముగ్గురు అన్నల తర్వాతి వాడు కనుక గారాబంగా పెరిగినా, బాల్యం నుండి క్రమశిక్షణ,దేశ భక్తి, దైవ భక్తి సాటి మానవులకు సేవ జేయాలనే తపన ఆయనలో ఉండేవి. ఒక్కసారి చదివితే చాలు దేన్నైనా మర్చిపోయే వాడు కాదు. అన్యాయం జరుగుతున్నది అనిపిస్తే ఎవరికైనా ఎదురు తిరగడమే బాల్యంనుండి ఆయనకు అలవాటు.
బాల్యంలో ప్రోటేస్తేంట్ యురోపియన్ స్కూల్ లో భారతీయ విద్యార్ధులను చులకన జేసి ఇబ్బందిపెడుతుంటే రెండుసార్లు విద్యార్ధులను కూడా దీసి ఆంగ్లేయ విద్యార్ధులను చితక బాదడంతో మొదలైకలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు అన్యాయంగా నిందించిన ప్రొఫెసర్ని నిలదీసి, కళాశాల బందు చేయించి, విద్యార్ధులను కూడగట్టి చివరికి కళాశాల నుండి వెలివేయ బడేదాకా,ఆ తర్వాత స్వతంత్ర సమర రంగంలో ప్రవేశించిన తర్వాత ఎవరినైనా సరే నిర్మొహమాటంగా నిలదీయటం వలన ఎందరు ఆయనను వ్యతిరేకించినా నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, ఎవరికీ అడుగులకు మడుగులు వత్తని స్వంతంత్ర వ్యక్తిత్వం, ఆయన మీద జాతీయ స్థాయి వాళ్ళు అనిపించుకున్న వాళ్ళకు కూడా ఈర్ష్య ను కలిగించాయి! ఐనా ఎవరికీ ఆయన ఎన్నడూ భయపడలేదు, గులాంగిరి చేయలేదు! సింహం లాగా బ్రతికి యుద్ధరంగంలో సింహం లాగానే మరణించాడు.
పండగకు కొత్త బట్టలు, మిఠాయి, వద్దు అని అందుకు బదులుగా..ఆంగ్లేయులను ఎదిరించినందుకు నడి వీధిలో కొరడా దెబ్బల శిక్షను అనుభవిస్తున్న సుశీల్ కుమార్ అనే అతడిని చూపించమని తన మేన మామనుపట్టుబట్టి అక్కడికి వెళ్లి..ఆ సుషీల్ కుమార్ను కొడుతున్నప్పుడల్లా ఆవేశంతో తను వుగిపోతుంటే మేన మామకు భయం వేసి అక్కడినుండి తీసుకొచ్చాడు! తన నోట్ పుస్తకాలలో దేశ భక్తుల, విప్లవ విరుల ఫోటోలు అతికించుకునివరిగురించే మననం చేస్తుంటే ఆ నోట్ పుస్తకం చూసినఅతని తండ్రి స్నేహితుడు భవిష్యత్తులో వీడు ఆంగ్లేయులకుకొరకరాని కొయ్య అవుతాడు అన్నాడుట!
ఉత్తర ప్రత్యుత్తరాలంటే సుభాష్ చంద్ర బోస్ కి చాలా అభిరుచి వుండేది. అతని ఉత్తరాలు ఎంతో లోతైన, సునిశితమైన వేదాంత భావాలతో, సూక్తులన్ వంటి వ్యాఖ్యానాలతో ఉండేవి, అతని వుత్తరాలకోసం ఇంటిల్లిపాది ఎదురు జూసే వారు. వేణీ మాధవ్ అనే ఉపాధ్యాయుడు ఈయనను చాలా ప్రభావితుడిని చేశాడు. శారీరక, మానసిక ఆరోగ్యం ఈ రెండూ సమన పాళ్ళలో వుండాలని భావించేవాడు. ధ్యానం, ప్రకృతి వొడిలో వొంటరిగా గడపడం, వివేకానంద బోధనలనుపఠించడం, చరిత్ర ను చదవడం ఆయనకు అభిరుచులుగా ఉండేవి. తను కాలేజికి నడచి వెళ్లి..డబ్బులు మిగిల్చి వృద్ధులైన బిచ్చగాళ్ళకు దానం చేసే వాడట! కలకత్తా లో నావ వివేకానంద సమూహం అనే సంస్థ లో సభ్యుడైసామాజిక, ఆధ్యాత్మిక సేవ జేసేవాడు. ఎవరికీ చెప్పకుండా ఒక మిత్రుడిని వెంట తీసుకుని హరిద్వార్, హృషికేష్వారణాసి మొదలైన ప్రదేశాలన్నీ ఒక గురువు కావాలని అన్వేషిస్తూ కొన్నాళ్ళు తిరిగి ఎక్కడ చూసినా, ఉపన్యాసాలు, పూజలు, యజ్ఞ గుండాలు చూసి విసుగొచ్చి వెనక్కోచ్చాడు.
కటక్ లో ఉన్నప్పుడే ఇంటర్ చదువుతున్నప్పుడు 'స్వేచ్చా సేవ సంఘ్' అనే ఒక సంస్థను ఏర్పాటు జేసి, యువకులనుకూడ దీసి సమాజ సేవ, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం, క్రీడలు, వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతను కుర్చుని చదువుతున్నట్లు ఎవరూ ఎన్నడూ చూడలేదు..మెట్రిక్యులేషన్,ఇంటర్, తర్వాత బి.యే...అన్నింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఐ.సి.ఎస్. లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందాడు. ఆ తర్వాత భారత్ తిరిగి వచ్చిన తర్వాత గాంధీని కలిశాడు. కొంతకాలం కలకత్తా నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్ గా పని జేశాడు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వయం సేవక దళంలో కార్యకర్తగా వున్నాడు. 'బంగ్లార్ కధ' 'ఫార్వార్డ్' అనే పత్రికలకు సంపాదకుడిగా పనిజేశాడు. విప్లవ మార్గంలో పోరాటం చేస్తున్న 'యుగాంతర్' 'అనుశీలన్' అనే సంస్థలకు అభిప్రాయ భేదాలు వస్తే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశాజ్ వచ్చినప్పుడు నిరసన చేసినందుకు ఆర్నెల్లు జైలు శిక్ష విధిస్తే న్యాయ మూర్తితోకోడి ని దొంగిలిస్తేనే ఆర్నెల్లు శిక్ష వేస్తారు..ఇదేనా ప్రిన్సు ఆఫ్ వాలెస్ కి వున్న విలువ? అని ప్రశ్నించాడుట!కలకత్తా కార్పోరేషన్ లో అధికారిగా వున్తూన్నప్పుడు ఒక ఆంగ్లేయుడు సిగరెట్ తాగుతూ ఆఫీసులోకొస్తేచెడా మడా వాయించి క్షమాపణ చెప్పించాడు..ఆ క్స్క్షతో..ఇంకొన్ని కారణాలతో ఆయనను ఖైదు చేసి, అక్కడక్కడాజిల్లాలో వుంచి చివరికి మండలే జైలుకు పంపారు! అక్కడినుండే జైలులోనుండే కలకత్తా శాసన సభకు ఎన్నికయ్యాడు.ఆయన ఆరోగ్యం జైలులో విషమిస్తే, పైపెచ్చు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే తప్పనిసరి..కొన్ని ఆంక్షలు విధించి ఆయననుప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్స్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్స్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు..దీనితో ఆయనకు పెరుగుతున్న ఆదరణకు అసూయా పరులూ పెరిగారు!
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా మళ్ళీ ఆయన్ను అర్రెస్ట్ జేసి అక్కడక్కడా జైళ్లలో తిప్పి..చివరికి మళ్ళీ దేశ బహిష్కర శిక్ష వేసింది..ఆయన ఆరోగ్యం క్షీణిస్తే ప్రజలు చందాలు వేసి మరీ వియన్నా పంపారు.చికిత్స మరియు విశ్రాంతి కోసం..అప్పుడే యూరప్పర్యటించాడు..ముస్సోలినీ..హిట్లర్..రోమరోల..మొదలైన మహామహులను కలిశాడు..ఆ రోజుల్లోనే..1933 లో ఇండియన్ స్ట్రగుల్అనే పుస్తకాన్ని వ్రాశాడు. తండ్రి మరణం తో భారత దేశానికి వచ్చి మళ్ళీ యూరప్ వెళ్ళాడు. వియన్నాలో చికిత్స తీసుకున్నాడు. ౧౯౩౬ లొ నెహ్రూ అధ్యక్షతన లక్నో లో జరిగే కాంగ్రెస్స్ సమావేశాలకు భారత దేశంలో దిగగానే ఆయనను అర్రెస్ట్ జేసి ఎరవాడ జైలుకు పంపారు. పిత్తా శయంలో లోపం వల్ల గొంతు బొంగురు పోయింది. 1937లో ఆయనను విడుదల చేశారు. అఖిల భారతకాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు. దేశమంతా పర్యటిస్తూ ప్రజలను తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఉర్రూతలూగించాడు.ఈ దశలో ఆయన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యాడు!. సహజంగానే ఆది ఆయనపట్ల అసూయాపరులను పెంచింది. రెండవ సరి మళ్ళీ పోటీజేసి పట్టాభి సీతారామయ్య మీద గెలిచి కాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు..అప్పుడు తీవ్ర అనారోగ్యంతోకనీసం తన గెలుపు కోసం యే మాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ఆయన..అధ్యక్షా ఉపన్యాసం కూడా ఆయన వ్రాసి ఇస్తే ఆయనసోదరుడు చదివి వినిపించాడు. ఆ తర్వాత ఆయన వెనుక ఎన్నో కుట్రలు ప్రయత్నాలు జరిగి 1939 లో ఆయనను కాంగ్రెస్స్ నుండి బహిష్కరించారు!
లొంగడం, పోరాటం ఆపడం, ఒకరి కాళ్ళు పట్టుకోడం తెలియని వాడు కనుక వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని పెట్టాడు.వారపత్రికను కూడా వెలువరించడం మొదలు పెట్టాడు. మరలా దేశమంతటా పర్యటించాడు..మద్రాసు మొదలుకొని ప్రతి చోటా ప్రతిసమావేశానికీ లక్షలాదిమంది ప్రజలు ఆయన ఉపన్యాసాలకు వచ్చే వారు! అంబేద్కర్, సావర్కర్, హెడ్గెవార్ మొదలైన వారందరినీ కలిశాడు.. అందరూ ఆయనలో ఒక గొప్ప నాయకుడిని, అకళంక దేశ భక్తుడినీ చూశారు..1940 లో మరలా ఆయననుఅర్రెస్ట్ చేసి, తప్పనిసరి ఐ విడుదల చేసి, గృహ నిర్బంధం లో ఉంచితే..పథకం ప్రకారం 17 -01 -1941 న మహమ్మద్ జియా ఉల్ హక్అనే దొంగ పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి తప్పించుకుని..తన వ్యక్తి గత సేవకుడు భగత్ రామ్ కు రహమత్ ఖాన్ అని పేరు పెట్టి.. అతనితో కలిసి..Kaka మెయిల్ లో ఢిల్లీ..పెషావర్..కాబుల్ దాటి భారత సరి హద్దులను దాటి నప్పుడు కళ్ళ నీళ్ళతో..వందే మాతరంనినాదం చేస్తూ..సాష్టాంగ దండ ప్రణామం చేసి..భారత దేశ ధూళిని నుదుట పెట్టుకున్నాడుట! కాబూల్ లో ఉత్తం చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకు బస, ధనం, ఇతర సహకారాలు ఇచ్చాడు. రష్యా,జర్మని, ఇటాలి దేశ రాయబారులతో మంతనాలుచేశాడు. 1941 మార్చ్ 18 న అక్కడి నుండి ఒర్లాండ్ అనే మారు పేరుతొ సమర్ఖండ్, మాస్కో ల మీదుగా బెర్లిన్ చేరుకున్నాడుజపాన్, ఇటలి, జెర్మని లకు చెందిన సైన్యాధికారులను కలుసుకున్నాడు..వారందరూ ఈయనను ఎన్నో రకాలుగా పరిశీలించినతర్వాత ఈయనను స్వతంత్ర భారత రాయబారిగా గుర్తించారు! బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన జరిగింది..26 -01 -1942 న పులి బొమ్మ కలిగిన జండా ఎగరేసి..బోస్ వేలాది మంది సైనికులను ఉద్దేశించి ప్రసంగించాడు..వారందరూ రక్త శపథం చేశారుప్రాణాలున్నంత వరకూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడతామని. రోం లో, జపాన్ లో కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ శాఖలు ఇతర స్వతంత్ర వీరుల నేతృత్వం లో ఏర్పడ్డాయి. 27 -02 -1941 నాడు ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుతమైన ప్రసంగం చేసి యావత్భారతాన్నీ ఆవేశం లో ముంచెత్తాడు.
ప్రపంచ యుద్ధం తీవ్రమై..ఆంగ్లేయులు వరుసగా వోటమి పాలు అవుతూ..ఒక్కొక్క దేశాన్నే ఒక్కొక్క నగరాన్నే వదిలి పెట్టడం మొదలు పెట్టారు.జపాన్ వరుస విజయాలను నమోదు చేస్తున్నది..జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు..రాస్ బిహారీ బోస్ మొదలైన వారు ఆహ్వానిస్తే 45 రోజులు ఒక జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకొని అక్కడ తన పేరు 'మత్సుడ' అని మార్చుకున్నాడు.. టోక్యో..సింగపూర్..రంగూన్ లలో సమ్మోహితులను జేశే స్ఫూర్తి దాయకమైన ఆయన ఉపన్యాసాలకుఆజాద్ హింద్ ఫౌజ్ లో తండోపతండాలుగా సైనికులు చేరారు..మహిళలకోసం ప్రత్యకమైన విభాగాన్ని ఏర్పాటు చేయ వలసి వచ్చింది...రంగూన్ లో ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి..మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు.
చలో ఢిల్లీ నినాదం ఇచ్చి..ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి..జపాన్ సహకారం ఖాయం ఐన తర్వాత..ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా..అంతవరకూ సహకరించిన విధి ప్రక్కకు తొలిగి పోయింది..కష్టాలు చుట్టూ ముట్టడం మొదలు పెట్టాయి..ముస్సోలినీ, హిట్లర్ ల చరిత్ర సమాప్తం ఐంది..జపాన్ దేశం యుద్ధంలో వోటమి చవిచూడడం మొదలు పెట్టింది..బర్మాలో తీవ్రమైన వరదల మూలంగా సైనికులు అనారోగ్యం, మృత్యువులకు గురి అయినారు..ముందుకు, వెనక్కూ పోలేని పరిస్థితి వచ్చింది..జపాన్ సైన్యాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి సమన్వయ లోపం వచ్చింది..రష్యా జపాన్ మీద దాడి చేసింది..జపాన్ మీద అణు బాంబ్ పడ్డది..జపాన్ అతలాకుతలమై లొంగిపోయింది..సుభాష్ చంద్ర బోస్ నిస్సహాయుడైనాడు..సహచరుల మొండి పట్టుదల బలవంతం మేరకు సుభాష్ చంద్ర బోస్ సురక్షిత స్థలానికి వెళ్ళడం కోసం, అజ్ఞాతం లోకి వెళ్ళడం కోసం మంచురియా వెళ్ళడానికి అయిష్టంగానేబయలు దేరాడు.జపాన్ లో విమానం ఎక్కి తైపే దాక ప్రయాణించిన తర్వాత విమానం లో సాంకేతిక ఇబ్బంది ఏదో వచ్చి..కూలి పోయింది..ఆ విమానంతో పాటే 35 కోట్ల భారతీయుల ఆశలూ నేల కూలాయి..స్వాతంత్ర్యం బిచ్చమడిగి తీసుకునే దానం కాదు..పోరాడి గెలుచుకునే హక్కు..అని నినదించి..చలో ఢిల్లీ అని గర్జించి..'' నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను..నాకు మీ రక్తాన్ని ఇవ్వండి..మీకు స్వతంత్రాన్ని ఇస్తాను..'' అని విశ్వాసం చివురింపజేసిన స్వతంత్ర పోరాట ధ్రువ తార నేల కూలింది..మెడ నుండి నడుము దాక తీవ్రంగా కాలిపోయి, సమీపం లోని హాస్పిటల్ లో వైద్య ప్రయత్నం జరిగినా..తీవ్రంగా మంటలలో కాలిపోయిన ఆయన ...18 -08 -1945 రాత్రి 8 .30 లకు కన్ను మూశారు!

సుభాష్ చంద్ర బోస్ బ్రతికి వుంటే..ఈ దేశ పరిస్థితి ఇప్పుడు ఇంకోలాగుండేది!!

శ్రీ కృష్ణ దేవరాయలు


 సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన కవి, పండిత పోషకుడే కాదు స్వయంగా కవి. పేరు వినగానే మనకందరికి గుర్తుకువచ్చేది ఆముక్తమాల్యద గ్రంథం. ఆయన మరెవరో కాదు..
"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,
దేశ భాషలందు తెలుగు లెస్స"..
అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు.
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు.
ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.
దక్షిణ దేశ దండయాత్రఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.
పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడుజింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు రెండవ కేంద్రము.కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భాగము.ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.తూర్పు దిగ్విజయ యాత్రతిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.
సైనిక విశేషములు
తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:
• 30,000 కాల్బలము
 • నాలుగు వేల అశ్విక దళము
 • రెండువందల ఏనుగులు
 ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.
 1. రాయసము కొండమరుసు
 2. పెమ్మసాని రామలింగ నాయుడు
 3. గండికోట కుమార తిమ్మానాయుడు
 4. వెలుగోడు గంగాధరరెడ్డి
 5. అకినీడు ఇమ్మరాజు
 6. ఆరవీటి నారపరాజు
 7. ఆరవీటి శ్రీరంగరాజు
ఉదయగిరి విజయం..
 ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు.
కొండవీడు విజయం..
1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు. తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.
కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
 • అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
 • విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.
 • అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.
 • కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరము లను జయించినాడు.
 • మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
 • కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవి ని వివాహమాడాడు.
 ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516 లో రాజధానికి తిరిగి వచ్చాడు.
బీజాపూరు దండయాత్ర..
1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట మరియు సయ్యద్ మరైకర్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొందినాడు; తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.
సైనిక వివరములు..
 న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని ప్రకారం సైన్యం ఇలా ఉన్నది:
 1. కామా నాయకుడు (పెమ్మసాని రామలింగ నాయుడు) : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు
 2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు
 3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 ఆశ్విక దళము, 30 ఏనుగులు
 4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల ఆశ్విక దళము, 50 ఏనుగులు
 5. కొండమ రెడ్డి 1 : 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు
 6. కొండమ రెడ్డి 2 : 80,000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు
 7. సాళువ గోవింద రాజు : 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు
 8. మధుర నాయకుడు : 15,000 కాల్బలము, 200 గుర్రములు
 9. కుమార వీరయ్య : 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు
 10. రాయలు : 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు
మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్ షా ఏనుగునెక్కి పారిపోయినాడు. సేనానులు దిక్కుతోచని వారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.
రాయచూరు యుద్ధము.. 
తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు (రాయచూరి యుద్ధము). రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.
తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.
• రాజ్య పాలన
 240 కోట్ల వార్షికాదాయము కలదు.
 సాహిత్య పోషకునిగా.. 
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
అష్టదిగ్గజములు..
1. అల్లసాని పెద్దన,
 2. నంది తిమ్మన,
 3. ధూర్జటి,
 4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
 5. అయ్యలరాజు రామభద్రుడు,
 6. పింగళి సూరన,
 7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
 8. తెనాలి రామకృష్ణుడు
ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
నిజానికి ఆయన తెలుగులో కన్నా సంస్కృతంలోనే ఎక్కువ గ్రంథాలు రాశాడు. ఆ మాట ఆయనే ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు మాటల ద్వారా చెప్పుకున్నాడు . భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన రాయలు తీర్థయాత్రలు చేశాడు. అపðడు ఆయన కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళానికి వచ్చాడు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినపుడు ఆంధ్రదేవుడు కలలో కనిపించి ఆముక్తమాల్యద రాయమని ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ
'పలికితుత్ప్రేక్షోపమలు జాతి పెంపెక్క రసికులౌనన 'మదాలస చరిత్ర'
 భావధ్వని వ్యంగ్య సేవధికాగ చెప్పితివి 'సత్యావధూ ప్రీణనంబు'
 శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి 'సకల కథాసార సంగ్రహంబు'
 శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తినైపుణి 'జ్ఞానచింతామణి' కృతి
అంతేగాక 'రసమంజరీ' ముఖ్య మధుర కావ్య రచన మెప్పించికొంటి గీర్వాణ భాష
 ఆంధ్ర భాష అసాధ్యంబె అందు ఒక్క కృతి వినిర్మిం పుమిక మాకు ప్రియము కాగఅంటాడు. ఈ పద్యం ప్రకారం రాయలు మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనంబు, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచిం తామణి, రసమంజరీగ్రంథాలను రచించాడు. అయితే కాలగతిలో అవన్నీ కనుమరుగైపోయి ఒక్క ఆముక్తమాల్యద మాత్రమే దక్కింది. ఇవికాక జాంబవతీ పరిణయం అనే నాటకం కూడా రాశాడని అంటారు. కానీ అది కూడా దొరకడంలేదు.
రామాయణం, మహాభారతం, మహాభా గవతం, హరివంశం వంటి గ్రంథాలు సంస్కృత మూల గ్రంథాలకు అను వాదాలు. మక్కీకి మక్కీ అను వాదాలు కాకపోయినా, వా టిలోనూ కొన్ని స్వ కపోల కల్పన లున్నా గాస టబీసట గాథలుగా జనపదాలలో వినిపించే ప్రఖ్యాత కథలు తెలుగు గ్రంథాలలో చోటు సంపా దించుకున్నా, వాటిలో తెలుగు ముద్ర కంఠదగ్నంగా ఉన్నా వాటిని స్వతంత్ర రచనలు అన డానికి ఆస్కారంలేదు. తన హయాంలోనూ మను చరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, కళాపూర్ణోదయం వంటి రచనలు వెలువడినా వాటికి మూలకథలు సంస్కృత ప్రఖ్యాత కథలే కావడం గమనార్హం. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాదిలో ఎంతో ప్రఖ్యాతమైన కథను ఎన్నుకుని దానికి ప్రబంధోచిత హంగులన్నీ అద్ది ఆండాళ్‌చరిత్రకు అక్షర రూపమిచ్చాడు. వైష్ణవులకే పరిమితమైన ఆమె కథను తెలుగు వారందరికీ తెలిసేలా చేశాడు. ద్రవిడ సాహిత్యం లో చిరకీర్తులున్న మహానుభావులెందరో ఉన్నా వారి ఇతిహాసాలను పుస్తకాలకెక్కించిన పెద్ద కవులు తెలుగులో దాదాపుగా లేరంటే అతిశయోక్తికాదు. స్వయంగా వైష్ణవమతానుయాయుడైన రాయలు ఆండాళ్‌తల్లి మీద అభిమానం, శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆదేశంపై ఆ దేవుడు గోదాదేవిని పరిణయమాడిన గాథను ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆంధ్రదేవుడు ఆదేశం ప్రకారమే ఈ గ్రంథాన్ని తిరుపతి వేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. ఈ పుస్తకంలో కథాప్రణాళికను రూపొందించు కో డానికి గురు పరం పరా ప్రభావం, ప్రపన్నామృతం, దివ్యసూరి చరిత్ర వంటి వైష్ణవ మత గ్రంథాలనే స్వీ కరించాడు. ఈ గ్రంథా నికి గోదా దేవి పేరు నేరుగా పెట్టినా, ఆరు ఆశ్వాశాల గ్రంథంగా దీన్ని విస్తరించినా ఆండాళ్‌ చరిత్ర 5వ ఆశ్వాసంలోనే ఆరంభమవు తుంది. మొత్తం 872 పద్యాలు సంతరించినా ఆండాళ్‌కు దక్కినవి 140 పద్యాలు మాత్రమే! ఈ గ్రంథంలో 5 విడి కథలు కనబడ తాయి. విష్ణు చిత్తుడికథ, ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం, యామునాచార్య వృత్తాం తం, గోదాదేవి వృత్తాంతం, చండాల, బ్రహ్మరాక్షసుల కథ ప్రధానంగా కనబడతాయి.
వారసులు..
• ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .
 • ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.
• ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన రాయలు తిమ్మరుసును గుడ్డివానిగా చేసాననే దిగులుతో మరణించారని చరిత్ర చెబుతోంది.
పై చిత్రంలో కనిపిస్తున్న శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే చిత్రపటం ఆచూకీ లభ్యమైంది. పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు. 
  తన తనువృత్తి విజయ నగర సామ్రాజ్య సీమల రక్షణంగా, తన మనః ప్రవృత్తి సరస సంగీత సాహిత్య సాంస్కృతిక సీమల వీక్షణంగా,విలక్షణ సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కారణ జన్ముడు శ్రీ కృష్ణ దేవరాయలు..కర్నాట ఆంధ్ర సీమలను పాలించినా,తెలుగు భాషపై,సంస్కృతిపై,ప్రజలపై ఎక్కువ మక్కువ చూపించిన మహానుభావుడు శ్రీ కృష్ణ దేవరాయలు! సమర విజయలక్ష్మికి తన శరీరాన్ని,సాహిత్య విద్యా లక్ష్మికి మనసును ఆత్మను కూడా అంకితం చేసిన వాడు శ్రీ కృష్ణ దేవరాయలు! ఒక్క చేతితో ముసల్మానులను,ఫ్రెంచి వారిని,డచి వారిని, పోర్చుగీసులను నిలువరించి , కేవలం ఇరవై సంవత్సరాలే పాలన చేసినా, చరిత్ర నిలిచి ఉన్నంత కాలము నిలిచిపోయే మహాద్భుతాలను అటు సమర రంగంలోనూ, ఇటు సాహిత్య రంగంలోనూ సాధించి,సంపూర్ణభారత దేశ చరిత్ర లోనే కాదు,ప్రపంచ చరిత్ర లో కూడా, ఇలాంటి చక్రవర్తులు చాల కొద్దీ మందే వున్నారు అని ప్రశంసలు పొందిన మహానుభావుడు!తన జీవిత కాలంలో ఒక యుద్ధంలో కూడా ఓడి పోని, నిరంతరము యుద్ధ రంగంలోనే గడిపిన ఏకైకచక్రవర్తి, శ్రీ కృష్ణ దేవ రాయలు!
నిజానికి, శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన అందించిన ఫలితాల కారణం గానే, ఈ నాడు ఆంధ్రభాషా, సాహిత్యం,సంప్రదాయం, కళలు మాత్రమే కాక భారతీయ ధర్మం, హైందవ ప్రదాయం,భారతీయ కళలు దక్షిణ భారత దేశంలో, విశేషించి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా నిలిచి వున్నాయి ఇతరమతాలకు, ధర్మాలకు, భాషలకు,దేశాలకు చెందిన వారిని అకారణంగాఏనాడూ ఇబ్బందులకు గురిచేయలేదు సరికదా,వేరే ధర్మాలకు చెందిన వారికి వారి మతాలకు సంబంధించిన ప్రార్ధనా కేంద్రాలను స్వయంగా కట్టించి ఇచ్చాడు, తను స్వయంగా వైష్ణవుడు ఐనా, శైవులను, మాధ్వులను, ఇతర శాఖలకు చెందిన వారిని ఆదరించాడు!ఆయన కాలంలో మరలా వైభవాన్ని పొందిన పౌరాణిక గాధలే ఈనాటికి ప్రబంధాలలో, కావ్యాలలో నిలిచి నేటి తరాలకు తరగనిఆధ్యాత్మిక,సాహిత్య,సాంస్కృతిక వారసత్వ సంపదను మిగిల్చాయి!
ఆంధ్ర సాహిత్యంలోని పంచ మహా కావ్యాలైన వాటిలో,ఆముక్తమాల్యదను ఆయన స్వయంగా రచిస్తే,మనుచరిత్రను ఆయన గురుతుల్యుడైన మిత్రుడు, ఆస్థాన కవి ఐన అల్లసాని పెద్దన రచించాడు, వసుచరిత్రనుఆయన కాలంలోని సాహిత్య ఉద్యమానికి ప్రేరితుడైన, పెద్దన శిష్యుడైన భట్టుమూర్తి అని పిలువబడిన రామరాజ భూషణుడు రచించాడు,పాండురంగ మహత్యమును అయన ఆస్థాన కవి ఐన తెనాలి రామకృష్ణుడు రచించాడు, ఒక శృంగార నైషధమును మాత్రము శ్రీనాధుడురచించాడు, కాని అది ఒక అనువాదం చేయబడిన గ్రంధం మాత్రమే కాని, ప్రధమంగా తెలుగులో రచించబడిన స్వతంత్ర కావ్యం కాదు!ఇది చాలు రాయల వారికీ ఆంధ్ర సాహిత్యానికీ ఉన్న సంబంధమును గురించి చెప్పడానికి!
కత్తి ఏదో ఒక నాడు లొంగి పోక దించక తప్పదు! కలం మాత్రం ఏనాడూ ఎవరికీ లొంగదు!నిరంతరమూతన ప్రభావాన్ని, ప్రతిభను వెలువరిస్తూనే వుంటుంది! రాజులు వెడలి పోతారు..కవి రాజులు నిలిచి పోతారు చరిత్రలో!రాజులూ రాళ్ళలో నిలిచి పోతారు కాని, కవి రాజులూ, కళాకారులు ప్రజల గుండెల్లో నిలిచి పోతారు..శ్రీ కృష్ణ దేవరాయలు మాత్రం రాజుగానే కాక, కవిరాజుగా, కళాకారునిగా,(ఆయన గొప్ప వీణా వాదకుడుట!) సంస్కర్తగా,ఆంధ్ర సారస్వత స్వర్ణ యుగ కర్తగా తెలుగుజాతి, భారత సంస్కృతి నిలిచి ఉన్నంత కాలమూ నిలిచి వుంటాడు!
జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
జయ నిత్య కీర్తి కాయా!
జయ కదన కవన రవి చంద్ర తేజ
జయ భువన విజయమున ఆంధ్ర భోజ .. 
నీ తనువు కదన ఘన విజయలక్ష్మికి
నీ మనువు కవనమున విజయలక్ష్మికి 
తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం..
చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మీ
పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మీ
చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
పెద రాణి తోడి కల కాల కలిమి..
నడి వీధిలోన రతనాలు రాశి
నడి రేయి దాక కవనాలు దూసి
పడి కరకు తురక తలచెండ్లు కోసి
కడలేని కీర్తిగనినావు వాసి... 
గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
మదవతులకైన శృంగార చిహ్నమా!
కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
తులలేని అలల సాహిత్య సంద్రమా!..
ఘన తెలుగు కవన ధారా విపంచి
పలికించి తేనెలొలికించి మించి
వలపించి చూడిక్కు డుత్త నాచ్చి
నేలించినావు రంగేశుకిచ్చి...
భువి రాజులెందు? శాసనములందు!
కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు, 
జన జీవనాడి నిశ్వాసమందు!
నిలిచుండురందు, నువు.. గుండెలందు!..
బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
దైవతములందు శ్రీ వేంకటేశుడు,
పలు దేశభాషలను తెలుగు లెస్సరా!
రాజులందు..రాయ!నువు లెస్సరా!...

Tuesday, February 21, 2012

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

              
బ్రాహ్మీమయ మూర్తి .మహాకవిసామ్రాట్టు..విశ్వనాధ సత్యనారాయణ

      ''తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ఎవరో నా 'ఏకవీర' ఉత్తమమని అన్నారు..నేను ఉత్తమమని ఎందుకనాలి?ఒక తరం పోయి మరొక తరం వచ్చినట్టు చెప్పిన'వేయి పడగలు' గొప్పది కాదా? దాని గుణ గణాలు ఎవరైనా పరిశీలించారా?ఎంతో సైకాలజీ గుప్పించిన 'చెలియలి కట్ట' ఏమైనట్టు? 'పురాణ వైర గ్రంధ మాల' లో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే! ఎవరైనా చూశారా? మన ప్రమాణాలునిలుస్తాయా? ఎంతో పోయె..దేవాలయాలే కూలి పోయె! ''...అని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పిన వాడు..
       ''రామాయణ కల్ప వృక్షాన్ని మించిన కవిత్త్వం ఉండదు..సర్వ శక్తులూ పెట్టి వ్రాశాను..పరమేశ్వరుడు అనుగ్రహించాడు..నారాయణుడే పరమేశ్వరుడు..'' అన్న ధీశాలి, జ్ఞాని...జ్ఞాన పీఠానికి ఘనతను తెచ్చిన ప్రజ్ఞాన ఖని..  '' సనాతన ధర్మం రాదు..కానీ..వేద మతానుసరణం తప్పదు..ఆది వినా ప్రపంచ శాంతిఉండదు..ఏ ఇజమూ గట్టెక్కించదు ..వేదిజం ఒక్కటే శరణ్యం..'' అని నిష్కర్షగాచెప్పిన వాడు... ''ఇంగ్లీషు లో ఏ రవీంద్రుడి లాగానో..ఇలియట్స్ లాగానో కవితా భాష వ్రాసే అలవాటుపోయింది..సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొకటో వాడినో అవుతాను..తెలుగులో నంటారా..పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తర్వాతపదమూడవ వాడిని నేను..'' అని రొమ్ము విరుచుకుని చెప్పగలిగిన దమ్మున్నదక్షుడు..

            ఒక ప్రసిద్ధ కవి, విమర్శకుడు, పాత్రికేయుడు ఐన వారి మాటలలో ..'' లక్షన్నరపేజీలకు పైగా తన రచనలను చేసిన వాడు..ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు..భారత దేశంలోనేవేరే ఏ కవికీ వారికున్నంత ప్రాచుర్యం లేదు..ఆధునిక కాలంలో..'' అని పొగడబడినమహానుభావుడు..'' వీళ్ళూ.. మా వాళ్ళు..'' అని తెలుగువాళ్ళు చెప్పుకొనవలసిన వాళ్ళలో ఎన్నాళ్ళ కైనా నిలిచిపోయే వాడు..ఆ మహానుభావుని గురించిఎవరు చెప్తే, ఎంత చెప్తే, ఏం చెప్తే సరి పోతుంది?..ఐనా మనసాగి చావదు కదా!...

            సాక్షాత్తూ కాశీ సంస్కృత విశ్వ విద్యాలయ ఆచార్యులచేత ' ఈ గమకం, సంస్కృతవృత్తాల శయ్య, గతి ఈ దేశంలోనే అపూర్వం! సంస్కృతాంధ్రాలు ఇంత అందంగాసహజీవనం చేస్తాయని మాకు తెలియదు, ..ఈ కవి రచనా రీతి విశిష్టమైనది..దీనిని ఆంధ్రరీతి అని కానీ..విశ్వనాధరీతి అని కానీ పిలుద్దాము..'' అనిపించినమహాకవి..కాదు..మహాకవి సామ్రాట్టు..విశ్వ నాధ సత్యనారాయణ వారు స్వయం కృషితో,పట్టుదలతో తనను ఒక్కొక్క భాషా సాహిత్యం గురించి ఎవరైనా ఎద్దేవా చేసినప్పుడల్లా..ఆ భాషా సాహిత్యాన్ని మథించి...లోతులు తుద ముట్టిన వారు, 10-09-1895 మన్మధ నామ సంవత్సరం లో నందమూరులో జన్మించారు, విద్యార్ధి దశ అంతా బందరు హిందూ హైస్కూల్ లో, నోబుల్ కాలేజీ లో గడిపారు. హిందూ హై స్కూలు ఆవరణంలోకానుగ చెట్లెక్కి అలవోకగా 'శృంగార వీధి' పద్యాలు చెప్పారట!

            నేషనల్ కాలేజి, హిందూ కాలేజి, ఏ సీ కాలేజి,విజయవాడ లో కళాశాలలో, కరీంనగర్ కళాశాలతొలి ప్రిన్సిపాల్ గా, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగాఎక్కడ వున్నా రచనా వ్యాసంగమే వారి ప్రధాన వ్యాసంగము! 1920 ప్రాంతంలో 'సాహితి' లోఅచ్చైన 'గిరికుమారుని ప్రేమ గీతాలు' వారి తొలి కవితలట. మొదటి నవల పేరు 'అంతరాత్మ'అట, జాతీయోద్యమ నేపధ్యంలో మొదలు పెట్టిన దీన్ని ఎందుకనో సగం వ్రాసి వదలి పెట్టారుట.

              ఆయన రచనా విధానం అత్యంత విచిత్రమైనది. పద్యాలయితే ఒకేసారి ఒక వంద తమమనసులోనే పూర్తి చేసుకొని, ఒకే సారి వాటిని కాగితం మీద పెట్టేవారట. ప్రయాణం లోనో,వేరే ఎక్కడనో ఉన్నప్పుడైతే ఒక్కొక్క పద్యానికి అంగవస్త్రానికి ఒక్కొక్క ముడి వేశే వారట.ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక్కొక్క ముడి విప్పుతూ ఒక్కొక్కటి స్ఫురణకు తెచ్చుకునేవారట. వచనం అయితే చెప్తుంటే వేరే ఎవరైనా లేఖకుడు వ్రాయాల్సిందే. ;ఏక వీర' వ్రాస్తున్నప్పుడుమాత్రం ప్రతి శుక్ర వారం టెంకాయ కొట్టి, పూజ చేసి..ఆశువుగా వినిపించే వారట. 'వేయి పడగలు'మాత్రం మొదట్లో స్వయంగా వ్రాయడం మొదలు పెడితే..మూడు ప్రకరణాలకు మూడు నెలలు పట్టిందట, ఇలా కాదని, చెప్పడం.. లేఖకుడు వ్రాయడం మొదలు పెట్టిన తర్వాత..29 రోజులలో వేయి పేజీలు ఏక బిగిన చెప్పారట!

        సుష్టుగా భోజనం చేసే భోజన ప్రియుడు, ఆవకాయలో పచ్చి మిరప కాయ కొరుక్కునే ఆశ్చర్యకరమైన అలవాటు, కామిక్స్ అన్నా..స్టంటు సినేమాలన్నా..ఇంగ్లీషు సినిమాలన్నావదిలిపెట్టని ప్రీతీ.. ఇవి కొన్ని వారి అభిరుచులు, అలవాట్లు! ఆయన పీఠికలు గొప్పవా.. ఆ పీఠికలు వున్న గ్రంధాలు గొప్పవా..అని అప్పుడప్పుడూఅనేకులకు సరసమైన సందేహం కలుగుతుంది! బ్రాహ్మీమయ మూర్తికి బొడ్డూడని బాలకుల బహు పరాకులు..శత సహస్ర నమోవాకాలు..

             ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. 
          ''ఒక జాతి జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రాణభూతిమ్మది ప్రాణశక్తి'' అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సంప్రదాయ భీష్ముడు. ఆయన మాట కరుకు, మనసు వెన్న, ఆయన మరెవరో కాదు తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకే సురాకృతి సుకృతమైన ప్రతిభకు భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే సాహిత్యాన్ని ఒక మార్గంగా తీసుకుని వర్తమాన కాలంలో ఆర్షధర్మానికి ఏకైక ప్రతినిధిగా నిలిచారాయన. తన జీవితాన్ని, సాహిత్యాన్ని, భారతీయ వైభవ పునరుద్దానికై త్రికరణశుద్ధిగా అంకితం చేసిన రుషి వంటి కవి ఆయన. 
                 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును. 
                విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం. 
              1895 సెప్టెంబర్‌ '10'న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన విశ్వనాధ సత్యనారా యణ తల్లిదండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి, సంపన్న కుటుంబంలో పుట్టినా దారిద్య్ర వ్యధలనను భవించిన ఉదారుడాయన. సత్యనారాయణగారి వ్యక్తిత్వం విలక్షణమయింది. బహిరంగ ప్రసంగాల ద్వారా తన ఆశయాలనూ, ఆదర్శాలనూ దాపరికం లేకుండా ప్రతిపాదించినా అంతరంగంలో స్వచ్ఛత నిలుపుకొన్న మనిషి ఆయన. ఎందరిని ఎన్ని విధాలుగా ఎంతగా, తూలనాడినా, ఆత్మీయతా ప్రదర్శన తో అతిథి మర్యాదలతో కులమతాతీతమైన ఆర్థ్రహృదయంతో సమ్మోహనపరచిన కొద్ది మందిలో ఆయన ఒకరు. ఈ వైరుధ్యం ఆయన రచనల్లోనూ కనిపిస్తుంది. ఆయన వచన రచనలు, తద్విరుద్ధమైన ద్రాక్షాపాకంలో నడనిచాయి. పాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. 
                 ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన 'విశ్వనాధ' గారి 'వేయి పడగలు' మాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతహాసం 'వేయిపడగలు'. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ఆ కాలంలో విశ్వనాధ వాణి ఆంధ్ర పౌరుష(1917), ఆంధ్ర ప్రశస్తుల(1919) రూపంలో సాహితీ రంగ ప్రవేశం చేసింది. 
              తన తొలి రచనలతోనే శ్రీశ్రీ వంటి ప్రతిభావంతున్ని మంత్రముగ్థుణ్ణి చేసి అనుకర్తగా ఆరాధకుడుగా, తీర్చిదిద్దినవాడు విశ్వనాధ. ఆ తరువాత శతాధికరచనలు చేసిన కొద్ది మందిలోనూ ఆయనే అత్యంత ప్రశస్తి పొందినవాడు. శ్రీనాధుడు తరువాత పరిసర ప్రకృతిని అంతగా పరిశీలించి వర్ణించిన మరో కవి విశ్వనాథే. ఆయన భాషా జోత్యభిమానాలకు తెలుగు రుతువులే నిదర్శనం. ఆయన రచనల్లో ప్రజాభిమానం సంపాదించినవి' 'కిన్నెరసాని' పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఆంధ్రా ప్రశస్తులు, విశ్వనాథ సత్యనారాయణ అభిమా నించిన రచన మాత్రం శ్రీ మద్రామాయణ కల్పవృక్ష (1934-62)మనే మహారచన. ఆ రచనకు జ్ఞానపీఠ్‌ పురస్కారం లభించింది. ఏకవీర చలన చిత్ర మయింది. చెలియలికట్ట పేరు తెచ్చింది. వరలక్ష్మి శ్రీశతి అనే స్మృతికావ్యం గుండెలు కరిగిస్తుంది. చారిత్రక నవలగా బద్దెన్న సేనాని ప్రతిష్టతెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితాధోరణుల మీద ఆయన విమర్శ వ్యాసాలు ప్రశంసలు కురిపించాయి. ఆంధ్రసాహిత్య చరిత్రను, భారతావతరణము'వంటి పది రేడియో నాటికలుగా మలిచారు. అమృత శర్మిష్ఠమ్‌, గుప్తపాశుపతమ్‌, అనే నాటకాలను 'ఆశ నిరాసకు' అనే నాటికను, 'దేవీ త్రిశతి' శివసాహస్రకు, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించాడు. సత్యనారాయణ గారి రచనలో ప్రతిదీ ఒక సంచలన రచనే అయింది. ఆ రచనలు వస్తురీత్యా, ప్రయో గరీత్యా, శిల్పరీత్యా, ప్రమాణాల రీత్యా సంచలనం కలిగించినవే. ఈ సంచలనంలో ఆయనను సాంప్రదాయకులూ, సాంప్రదేయే తరులూ విమర్శకుల రూపంతో సమంగానే ఎదుర్కొన్నారు. అడ్డగించటానికి ప్రయత్నించారు.
            అయినా ఈ అవరోధాలన్నింటినీ సమర్థంగా తొలగించుకొంటూ విశ్వనాధ తొలిసారిగా సాహిత్య సరస్వతి ప్రవహించింది. తెలుగు నవలా సాహిత్యంలో తొలిసారిగా నవలకు 'కావ్య' గౌరవం సంపాదించి పెట్టింది. 'ఏకవీర' వస్తువు,దీని నిర్వహణపరంగా నూత్న ద్వారాలు తెరిచింది. కిన్నెరసాని పాటలు తెలుగులోని మాధుర్యాన్ని వాగులు పారించింది. 
               ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా విశ్వనాథ సత్యనారాయణ మహాకవి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించనివారు కూడా ఆయన ప్రతిభని కొనియాడారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదీ ఆయన గొప్పదనం. అదీ ఆయన సాధించిన సర్వకాలీన సార్వత్రిక సాహితీ విజయం. ఆయన రామాయణ కల్ప వృక్షం అర్థం కాక పోతే కిన్నెసాని పాటలు ఆస్వాదించవచ్చు. ‘వేయి పడగలు’... అంత బృహత్‌ నవల చదివే తీరిక, ఓపిక, సమయం లేదనుకొంటే ‘చెలియలికట్ట’ లేదా ’ఏకవీర’ లేదా పులి ముగ్గు వంటివి చదవచ్చు. ఏ ప్రక్రియను అభిమానించే వారికి ఆ ప్రక్రియలో ఎన్నో రచనలు చేసిన జ్ఞానపీఠి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రచనలు ముద్రించే కుమరుడు విశ్వనాథ పావని శాస్త్రితో ఏమాత్రం సంబంధం లేకుండా ‘‘విశ్వనాథ సాహిత్య పీఠం’’ వెలిసింది. ఆ సంస్థ ప్రచురించిన ‘‘విశ్వనాథ వారి ముద్దు వడ్దన్లు’’లో ఏముందో చూద్దాం. 
                 ఆయన చేపట్టని ప్రక్రియా ప్రయోగమూ లేదన్నట్టుగానే, మానవ జీవితంలో ఆయన స్మృశించని సమస్య కూడా లేదేమోననిపిస్తుంది. ఆయన ప్రతి నవలా, ప్రతి కథా ఏదో ఒక సామాజిక సమస్యనో, మానసిక సమస్యనో, ఆధ్యాత్మిక సమస్యనో, సాహిత్య సమస్యనో, ఆర్థిక, రాజకీయ సమస్యనో...ప్రధానీకరిస్తుంది. విశ్వనాధ సత్యనారాయణ ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, ఆధునికాంధ్ర సాహిత్యంలో వారసత్వం, గురువు చూపిన పద్యరచనా సంప్రదాయం ఆయనలో స్థిరంగా నిల్చిపోయాయి. తరతరాలుగా అవిచ్ఛన్నంగా వున్న భారతీయ ధర్మం, మాత్రమే ఏక కాలానికి అయినా మానవజాతికందరికి ఆదర్శం. అనుసరణీయమని ఆయన అచంచల విశ్వాసం. భారతీయ ధర్మాన్ని, ప్రతిభాపాండిత్యాన్ని విజ్ఞాన విశేషాలన్నీ కవిత్వంలో రసమయంగా మలచి అందించిన మహాకవి విశ్వనాథ. దాదాపు అరవై నవలలు రాసి, ఆ నవలా సృష్టిలో భారతీయ ధర్మంతో పాటు, ఆధునిక భావాలను వ్యాఖ్యాన ప్రాయంగా కథ కల్పన చేసిన నవలా చతురాస్యుడు. సంస్కృతనాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ఠ, తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి, కావ్యతేదహరిశ్చంద్ర ప్రసిద్ధమైనవి. దాదాపు 150 గ్రంథాలకు పైగా రచన చేసిన ఏకైక తెలుగు కవి, విమర్శకుడు విశ్వనాథ. ఆయనకు 1958లో శాసన మండలి సభ్యత్వం వచ్చింది. 1971లో ఆస్థానకవి పదవి సంక్రమించింది. 1942లో కలకత్తాలో పుష్పకిరీటసన్మానం జరిగాయి. 'విశ్వనాధ' కొలవెన్నురామకోటేశ్వరరావుతో కలిసి ''త్రివేణి' అనే దైవమాసికాంగ్ల పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు. ....'జయంతి' అనే దైవమాసిక తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. 
                ఆయన మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఈ చిన్ని ఉదాహరనే చాలు...బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో  ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ( పైనున్న ఆయన చిత్రం ఆ సందర్భంలోనిదే ఉండొచ్చు ) ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు. ” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. 
” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు. 
” ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. 
” పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! ” అన్నాడా అబ్బాయి తాపీగా. 
అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది. 
” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు. దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి…” లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! “…… అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు.
విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ ! 

            రచయితగా ఆయన సుదీర్ఘ జీవితంలో ఎదురైన వ్యక్తులతో జరిపిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వం, సాహిత్యంపై ఇతరుల అభిప్రాయాలు, వివిధ సంఘటనలపై ప్రతి స్పందనలు ఆయన వివిధ అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ నాలుగు సంకలనాల్లో ఉన్నాయి. అటువంటివి కొన్ని చూద్దాం. 
* ‘‘మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి’’ అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక తూరి. దానికి వారు ‘‘ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్వసిక్త నేత్రులు కావడం’’ అని అన్నారట.’’ 
* ఈ జ్ఞానపీఠ బహుమతికి తగుదునా? తగనా? అన్న విచారణ ఉంది. ఇదివరకు వచ్చిన వాళ్లంతా తగితే నేను మాత్రం ఎందుకు తగకూడదు? అనే దురహంకారము లేకుండా ఉండేందుకు అంత చేవ చచ్చిలేను గదా. నాకు అవార్డు ద్వారా లభించిన లక్ష రూపాయలలో చాలా మొత్తాన్ని మా తండ్రిగారు అరవై యేండ్ల క్రితం నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు వినియోగిస్తాను. మిగతాది అనేక రంధ్రాలున్న నా జేబులో వేసుకొంటాను.
* లోకంలో మానవజాతి రెండు రకాలు. ఒక రకం సంసారులు, రెండవ రకం బిక్షగాళ్ళు. అధికారులనండి, సన్యాసులనండి, మత గురువులనండి, కవులనండి, గాయకులనండి వీళ్ళందరూ రెండవ రకం. వీళ్ళు బిచ్చగాండ్లు. వీళ్లకు సంసారాలు చట్టు బండలు అక్కరలేదు. వీళ్లకు కొట్టుకు తినడం ప్రధానం.* ‘‘పాలముంచినా నీట ముంచినా నువ్వే’’ నన్నాడు. నేనన్నాను కదా మాకు పాలూ నీళ్లూ రెండూ విడివిడిగా ఉండవు. కలిసే ఉంటాయి. ఇల్లు దూరమైన కొద్దీ నీళ్లుక్కువ కలుస్తవి.* ఓ మీటింగులో విశ్వనాథవారు ‘‘వేసవి కాలంలో కాలవలు ఎండిపోతాయి. కాబట్టి వాటిలో చెలమ గుంటలు త్రవ్వుతారు; తియ్యటి నీళ్ళు పడతాయి’’ అని అన్నారట. ‘‘ఒరే! మా ఊళ్లో కాలవల్లో చెలమ గుంటలు తవ్వితే నీళ్ళు పడవేమిటిరా?’’ అని అన్నారట చెళ్లపిళ్ళవారు విశ్వ్నాథతో. ‘‘ఎట్లా పడతాయి? ఆ నీళ్లన్ని మన కవిత్వంలోకి ఎక్కితే’’ అని అన్నారట విశ్వనాథవారు. ఇటువంటి సంభాషణలు కొల్లలుగా కనిపిస్తాయి.

కల్పవ్రుక్షాలయిన సాహితీ సంపదని మనకి వారసత్వం గా అందించి 1976 అక్టోబరు 18న న పరమపదించారు.

ఎందరో మహానుభావులు ....... అందరికీ వందనములు !!!!!!!!!